పంజాబ్ మాజీ మంత్రి రాణా గుర్మిత్ సింగ్ సోధీ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ చీఫ్ జేపీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రాణా సోధి మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు నమ్మకస్తుడు. గురు హర్ సహాయ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అమరీందర్ తొలగింపు తర్వాత సోధీనీ పార్టీ కేబినెట్ నుంచి తప్పించింది. అమరీందర్ పార్టీని వీడిన తర్వాత కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన మొదటి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ క్యాబినెట్ మంత్రి సోధి. ఆయన బీజేపీ టిక్కెట్‌పై ఫిరోజ్‌పూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఫిరోజ్‌పూర్ హిందువులు గణనీయంగాఉన్న స్థానం.
“పంజాబ్ కాంగ్రెస్‌లో గొడవలు, అంతర్గత పోరు వల్ల నేను తీవ్రంగా బాధపడ్డాను. దీని వల్ల పార్టీకి నష్టం జరగడంతో పాటు రాష్ట్రానికి, ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో, ప్రత్యేకించి పార్టీ రాష్ట్ర భద్రత, మత సామరస్యాన్ని పణంగా పెట్టినప్పుడు నేను ఊపిరాడకుండా, నిస్సహాయంగా భావిస్తున్నాను. పంజాబ్‌లో శాంతి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడానికి బదులు, కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సరిహద్దు రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పని చేస్తోంది” అంటూ విమర్శలు గుప్పిస్తూ సోనియాకు లేఖరాశారు సోధీ.