మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కరోనా కాటుతో మృతిచెందారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను గురువారంన నాడు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మరణించారు. చందూలాల్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చందూలాల్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్ర్రాంతి వ్యక్తం చేశారు. చందూలాల్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. గిరిజన ప్రజల సమస్యలకోసం ఆయన ఎన్నో సేవలు చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు.