తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ ప్రారంభమైంది. ఈ సభలో నరేంద్ర మోదీ, దేశ నాయకులు, బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు సహా పలువురు హాజరయ్యారు. ఈ క్రమంలో చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, కొండా విశ్వేశ్వరరెడ్డి చేయి పట్టుకుని కార్యకర్తలకు అభివాదం చేయించారు.
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడైన కొండా విశ్వేశ్వరరెడ్డి.. టీఆర్ఎస్ తరపున 16వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు 2014, 2018 తెలంగాణ ఎన్నికల టైంలో.. అఫిడవిట్ ఆధారంగా రిచ్చెస్ట్ పొలిటీషియన్‌గా నిలిచారు కూడా. 2018లో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. గత ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.