భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఈరోజు గుండెపోటుతో కన్నుమూశారు. ఈరోజు మార్నింగ్ వాక్ సమయంలో 62 ఏళ్ల చౌదరి గుండెపోటుకు గురయ్యారు, సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడే అతను తుది శ్వాస విడిచారు. మాజీ IPS అయిన చౌదరి JSCA హెడ్ గా పనిచేశారు, అలాగే 2019 వరకు BCCI తాత్కాలిక కార్యదర్శిగా కూడా ఉన్నారు. రెండేళ్ల క్రితం జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు.
JSCA చీఫ్ గా ఉన్న సమయంలో.. చౌదరి జార్ఖండ్ క్రికెట్ కు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2019లో లోధా కమిటీ సిఫార్సుల నేపథ్యంలో సుప్రీంకోర్టు అమలు చేసిన కూలింగ్-ఆఫ్ పీరియడ్ నిబంధన కారణంగా చౌదరి JSCA ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. అడ్మినిస్ట్రేటర్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు చౌదరి అనేక టూర్ లో భారత క్రికెట్ జట్టు మేనేజర్ గా కూడా పనిచేశారు.