అటవీ వనరులను పరిరక్షించటం అందరి బాధ్యతగా గుర్తించాలి. ఇందుకోసం సమాజంలో చైతన్యం తెచ్చేందుకు తెలంగాణ అటవీ శాఖ వినూత్న మార్గాన్ని ఎంచుకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ హైస్కూల్స్ లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని సోనాల మండల కేంద్రములో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో.. సోనాల అటవీ శాఖ వారిచే విద్యార్థులకి అటవీ పరిరక్షణ గూర్చి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకి అటవీ శాఖ అధికారులు విద్యార్థులకి అనేక విషయాలు విడమరిచి చెప్పారు. ముఖ్యంగా పర్యావరణ సమతుల్యత,అటవీ పరిరక్షణ, అడవిని కాపాడటం , అడవి జంతువుల పరిరక్షణ వంటి విషయాల మీద పాఠశాల విద్యార్థులకి అవగాహన కల్పించడం జరిగింది.
ఇందులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ముంతాజ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాధేశ్యం,శ్రీధర్,శంభు లు తదితరులు పాల్గోన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాలు పంచుకున్నారు.