10, 12 ఏళ్ల అమ్మాయిలను ఎత్తుకెళ్లడం, దేశ సరిహద్దులు దాటించి వృద్ధులకు ఇచ్చి పెళ్లి చేయడం జరిగి పోతున్నాయి. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ రాకెట్ మరోసారి బయటపడింది. 15 సంవత్సరాల హిందూ అమ్మాయిని దేశ సరిహద్దులు దాటించేశారు. 50 సంవత్సరాలు దాటిన ఒక ముసలాడికి ఇచ్చి పెళ్లి చేసి జీవితాన్ని నాశనం చేశారు. ఈ తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఆమె మతం మారినట్లుగా సర్టిఫికెట్లు పుట్టించారు.
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో 15 ఏళ్ల హిందూ బాలిక ఫోటోలు బయటకు వచ్చాయి. ఆమెకు 50 ఏళ్ల ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించడం కలకలం రేపుతోంది. వివాహం స్వచ్ఛందంగా జరిగినట్లు అఫిడవిట్ పుట్టించారు. ఆ తర్వాత గొడవ పెద్దదవడంతో ఆ బాలిక ముందుగానే మతం మారింది అంటూ కొన్ని ఆధారాలను పుట్టించారు.
ఇష్టపూర్వకంగా ఇస్లాం మతంలోకి మారిందని ఆమెతో కాగితం రాయించారు. అలీ అనే ముసలాడిని పెళ్లి చేసుకున్నట్లు లెక్కలు చూపించారు.
ఎన్ని దొంగ లెక్కలు పుట్టించినా.. ఒక్క ఫోటో నిజం చెబుతుంది అన్నట్లుగా ఈ ఫోటో సాక్షిగా.. ఆ అమాయకపు బాలిక కథ మొత్తం బయటపడుతున్నది.