మతమార్పిడి నిరోధక బిల్లును హర్యానా అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా బలవంతపు మత మార్పిడికి పాల్పడిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించే నిబంధనను తప్పనిసరి చేసింది.
హర్యానా మత మార్పిడి నిరోధక బిల్లు ప్రకారం.. మైనర్ బాలికలను, మహిళలను, షెడ్యూల్డ్ కులాలు సహా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులను మతం మార్చడానికి ప్రయత్నించిన వ్యక్తికి నాలుగు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష.. అలాగే 3 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు.
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా అనేక బిజెపి పాలిత రాష్ట్రాలు ఇప్పటికే మతమార్పిడి నిరోధక బిల్లులను ఆమోదించాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)