ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 10 నుంచి 7వతేదీవరకు ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది. మార్చిన ఫలితాలుంటాయి. ఉత్తర్ ప్రదేశ్లో ఏడు దశలలో పోలింగ్ జరుగుతాయి. ఫిబ్రవరి 10న మొదటి దశ పోలింగ్ ఉంటుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఫిబ్రవరి 14న, మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.
ఉత్తర ప్రదేశ్లో 403, ఉత్తరాఖండ్లో 70, పంజాబ్లో 117, గోవాలో 40, మణిపూర్లో 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ నేటి నుంచే అమల్లోకి వచ్చింది. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో మొత్తం 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 24.5 లక్షలమంది కొత్తగా నమోజు చేసుకున్నవారు.
ఇక ఈ నెల 15 వరకు రాజకీయ పార్టీలు రోడ్ షోలు, పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతి లేదని ఈసీ స్పష్టం చేసింది. తరువాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామంది.