త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీంలో భాగంగా నావికాదళంలో అగ్నివీరుల నియామకం పూర్తైంది. అయితే మొట్టమొదటి సారి నావికాదళంలోకి మహిళలను తీసుకున్నారు. అగ్నిపథ్ కింద 3వేల మంది అగ్నివీరులను నావికాదళంలోకి తీసుకోగా వారిలో 341 మంది మహిళలున్నారని నెవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ .హరికుమార్ తెలిపారు. రేపునావికాదళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక మీడియా సమావేశంలో ఈ వివరాలు తెలిపింది నేవీ. ఆత్మనిర్భర భారత్ పై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని…2047 నాటికి నావికాదళం పూర్తిస్థాయిలో ఆత్మనిర్భరత సాధిస్తుందని నెవీ చీఫీ తెలిపారు.
We've inducted 341 women Agniveers now. It's the first time women are being inducted into the ranks.We're not inducting women separately.They're being inducted in the same manner as their male counterparts. It's a uniform method of selection.They undergo similar tests: Navy chief pic.twitter.com/cWBawosVsf
— ANI (@ANI) December 3, 2022