తీవ్రమైన మతమౌఢ్యానికి పెట్టింది పేరైన తాలిబన్లు.. మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్గానిస్థాన్ దేశవ్యాప్తంగా చదరంగం క్రీడను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మేధోపరమైన ఆటగా పేరు తెచ్చుకున్న చెస్ ను దేశ ప్రజలు ఉపయోగించవద్దని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు .
ఇప్పటికే ప్రజల్లో ఆలోచన కలిగించే అనేక క్రీడలు సాంస్కృతిక అంశాలను తాలిబన్లు నిషేధించారు. అఫ్గానిస్థాన్ లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి సాంస్కృతిక, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెస్ మీద తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు అఫ్గానిస్థాన్ లో చెస్ మేధో క్రీడగా పరిగణించేవారు. ఇటీవల కాలంలో చెస్ ఆడేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే తాలిబన్ ప్రభుత్వం సాంస్కృతిక, వినోద కార్యకలాపాలను పరిమితం చేయడానికే నిషేధ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆడపిల్లల మీద అయితే భయంకరమైన ఆంక్షలు అక్కడ అమలు అవుతుంటాయి.
బాలికలకు నలుపు రంగు యూనిఫాం ఉండాలని ఆదేశించారు. యూనిఫాం విషయాన్ని పేర్కొంటూ తొమ్మిది పాయింట్ల నివేదిక రూపొందించారు. అందులో మహిళా ఉపాధ్యాయనుల యూనిఫాంకు సంబంధించిన వివరాలను చేర్చలేదు.
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై కూడా అనేక ఆంక్షలను విధించారు. వీరు అఫ్గానిస్థాన్ లో అధికారాన్ని చేజిక్కించుకునే ప్పటి నుంచి బాలికలు ఆరో తరగతి కంటే ఎక్కువ చదువుకోకుండా నిషేధించారు. విశ్వవిద్యాలయాలు, వైద్య, విద్యా కేంద్రాలలో మహిళలు చదవకూడదని ఆజ్ఞలు జారీ చేశారు.
ఇటీవల తాలిబన్లు ప్రకటించిన కొత్త యూనిఫామ్ ను విద్యార్థులు తప్పకుండా ధరించాలని ఆదేశించారు. ఈ ప్రకటన ప్రకారం, 1 నుంచి 9 తరగతుల విద్యార్థులు నీలి రంగు దుస్తులు, తెల్ల టోపీ ధరించాలని పేర్కొన్నారు. 10 నుంచి 12వ తరగతి విద్యార్థులు తెల్ల దుస్తులు,టోపీ లేదా తలపాగా ధరించాలని తెలిపారు.
భయంకరమైన ఆంక్షలు ద్వారా విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు. కానీ ఇటువంటి విధానాలను మన దేశంలోని కుహనా సెక్యులరిస్టులు ఆహా ఓహో అంటూ మెచ్చుకోవడం మరో విశేషం.