కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి పైత్యాన్ని ప్రదర్శించారు. భారత రాజ్యం మీద పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వ్యవస్థలను చులకన చేసి మాట్లాడే రాహుల్ గాంధీ.. మరో సారి తన పైత్యాన్ని ప్రదర్శించారు అన్న మాట బలంగా వినిపిస్తోంది.
…
ఆర్ ఎస్ ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ ఇటీవల ఒక సందేశం ఇచ్చారు. దేశం లో ఏకాదశి, ద్వాదశి లకు కొత్త పేర్లు వచ్చాయి అని అన్నారు. అయోధ్య లో రామమందిరం ప్రతిష్ట జరిగిన రోజును పురస్కరించుకొని ప్రతిష్ట ఏకాదశి, ప్రతిష్ట ద్వాదశి అన్న పేర్లు ప్రజలు వాడుతున్నారని చెప్పారు. ఇంకా చెప్పాలంటే, అయోధ్య లో బాలరాముడి గుడి ప్రతిష్ట తోనే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. బానిస చిహ్నాలు తొలగించుకొన్నామని దేశ ప్రజలంతా భావిస్తున్నారని ఆయన అభిప్రాయ పడ్డారు.
….
దీనిని వివాదాస్పదం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇందులో భాగంగా.. మోహన్ జీ వ్యాఖ్యలను వక్రీకరించేందుకు ప్రయత్నం చేసింది. స్వాతంత్ర పోరాటాన్ని, స్వాతంత్ర సమర యోధులను ఆయన అపహాస్యం చేశారు అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. అంతటితో ఊరుకోకుండా.. తన పైత్యాన్ని బయట పెట్టారు. దేశం మీద, రాజ్య వ్యవస్థ మీద పోరాటం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.
….
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. గతంలోకూడా రాహుల్ గాంధీ ఇదే మాదిరిగా పైత్యాన్ని ప్రదర్శించారు. విదేశీ గడ్డ మీద భారత్ ను అవమానించేట్లుగా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా రాజ్యం మీదనే తిరుగుబాటు చేయాలని పిలుపు ఇవ్వటం.. మరింత కలకలం రేపుతోంది. ఉద్దేశ పూర్వకంగానే ఈ దేశ యువతను రాహుల్ గాంధీ పక్కదారి పట్టిస్తున్నారని అంటున్నారు.