ఓ మహిళను నగ్నంగా నిలబెట్టి వీడియో తీసి దాన్ని వైరల్ చేసిన సీపీఎం నేత చుమత్ర ఎలిమన్నిల్ సాజిని తిరువల్ల పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం కార్యదర్శి సీసీ సాజిమోన్ తోపాటు… డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేత నాసర్ లు కూడా కేసులో ప్రధాన నిందితులు. బాధితురాలు కూడా సీపీఎం సభ్యురాలే. వీరిద్దరూ కూడా సదరు మహిళ బట్టలను బలవంతంగా విప్పి ఫొటోలు తీసినట్టు ఆ వీడియోలో ఉంది. సోషల్ మీడియా వేదికల్లో ఆ వీడియోను వందలాది మంది షేర్ చేసినట్టు తెలిసింది.
ఈ ఏడాది మేలో ఈ దారుణం జరిగింది. సాజిమోన్, నాసర్లు తనను కారులో ఎక్కడికో తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాధితురాలు తెలిపింది. ఆ సమయంలో తనకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొంది. 2 లక్షలు ఇవ్వాలని..లేకుంటే ఆ వీడియోను వైరల్ చేస్తామని భయపెట్టారని అంది. ఈ ఇద్దరు వీడియో తీస్తే..మిగతా 9మంది దాన్ని వైరల్ చేశారని ఫిర్యాదు చేసింది. వీడియోను వైరల్ చేసిన వారిలో ఓ లాయర్ కూడా ఉన్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు…ఐపీసీలోని
సెక్షన్ 354 ఎ (లైంగిక వేధింపులు), 354 బి 294 (అశ్లీల చర్యలు) కింద కేసు నమోదు చేశారు.
వీడియోను సర్క్యులేట్ చేయడంలో ఒక న్యాయవాది కూడా ఉన్నారని ఆమె పేర్కొంది. వీడియోను వైరల్ చేసిన వారిపై సెక్షన్ 501 (పరువు నష్టం కలిగించేలా వ్యవహరించడం) IT చట్టంలోని 67 (అశ్లీల అంశాలను ప్రసారం చేయడం) కింద బుక్ చేశారు. నిందితుల వాట్సాప్ చాట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
అటు సాజిమోన్ పై లైంగిక వేధింపుల అభియోగాలపై కోజీకోడ్ కు చెందిన సామాజిక కార్యకర్త రచయిత, కృష్ణసున్ని మండిపడ్డారు. “ స్త్రీ హక్కులు,లింగ సమానత్వాన్ని సీపీఎం గౌరవిస్తుందని చెబుతారని…. కానీ పార్టీ పదవులు, బాధ్యతల్లో ఉన్నవారే మహిళా కార్యకర్తల్ని ఇలా చేయడం ఏంటని మండిపడింది. అధికార పార్టీకి చెందిన నిందితులు…అధికారంలో ఉన్న ముఖ్యులకూ సన్నిహితులని..అందుకే పోలీసులను ప్రభావితం చేస్తున్నారని ఆమె అన్నారు. నిందితులు అధికార సీపీఐ(ఎం)కి చెందిన వారు కావడంతో పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు అన్నివైపులా వెల్లువెత్తుతున్నాయి. నిందితులు సీపీఐ(ఎం) ప్రాంతీయ కమిటీ కార్యాలయంలోనే తలదాచుకున్నారని బాధితురాలు అంటోంది. విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసుల్లో కదలిక మొదలైంది.
గతంలోనూ సాజిమోన్ పై పలు కేసులున్నాయి. ఓ వివాహితకు గర్భం చేసిన అతను… తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి… డీఎన్ఏ పరీక్ష రిపోర్టును తారుమారు చేసేందుకు ప్రయత్నించాడు. పార్టీ ఆన్ని స్థానిక కమిటీ సభ్యుడి హోదానుంచి తప్పించి కొట్టాలి కార్యదర్శిగా నియమించింది. ఇక బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి నాయకుడిపై ఆరోపణలు చేసిందంటూ ఆమెనే పార్టీ సస్పెండ్ చేసింది. మరోవైపు, పార్టీ నాయకుడిపై ఫిర్యాదు చేసినందుకు బాధిత మహిళను సీపీఐ(ఎం) సస్పెండ్ చేసింది. మహిళా సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ పెండింగ్లో ఉంచినట్లు మాతృభూమి కథనం పేర్కొంది. ఇక లైంగిక వేధింపులకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని…ఆమె ఆరోపణలు నిజమని తేలితే…అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని…ఏరియా కార్యదర్శి ఫ్రాన్సిస్ వీ ఆంటోని తెలిపారు.