ఫిబ్రవరి 14ని ప్రేమికుల దినంగా కార్పొరేట్ సంస్థలు ప్రమోట్ చేస్తున్నాయి కానీ మన చరిత్రలో దేశభక్తికి నిదర్శనంగా గుర్తు పెట్టుకోవాల్సిన రోజు ఇది. కహానా సెక్యులరిస్టులు భజన చేసే పొరుగు దేశాలు మన దేశం మీద ఎంత కుట్ర చేశాయో తెలుసుకోవలసిన రోజు ఇది.
సరిగ్గా ఇదే రోజున పుల్వామాలో మన సైనిక సోదరులను దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారు.
ఆ రోజు న సైనిక కాన్వాయ్.. జాతీయ రహదారిపై శ్రీనగర్ వైపు వెళ్తోంది. ఇంతలో అవంతిపోరాలోని గోరిపోరా ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు వీర మరణం పొందారు.
ఇది చాలా పెద్ద దాడి.
జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ దగ్గర నుంచే ఓ వాహనం వెళుతోంది. తమ కాన్వాయ్కి దూరంగా జరగమని సైనికుడు పదేపదే కోరుతున్నాడు. కానీ… అవతలి వాహనదారుడు పట్టించుకోలేదు. సైనికులకు అర్థమయ్యే లోపలే ఆ కారు కాన్వాయ్‌ని ఢీకొట్టింది. ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.దీనిలో ఓ ఇస్లామిక్ ఉగ్రవాది కూడా మరణించాడు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు జైషే మహ్మద్ అనే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ పేలుడు చాలా ప్రమాదకరం. దాని శబ్దం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించింది. ఆ సమయంలో పుల్వామా ప్రాంత పరిసరాల్లో మంటలు, పొగలు అలుముకున్నాయి.
ఈ దాడితో మన సైనిక సోదరులు రగిలిపోయారు. ప్రతీకారం తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించు కున్నారు. పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత ఇస్లామిక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్‌కి భారత్ గట్టి గుణపాఠమే చెప్పింది. కఠిన చర్యలు అవలంబించింది. 2019, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్ లోని బాలాకోట్ లోకి ప్రవేశించి, వైమానిక దాడులతో పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 300 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను సైన్యం హతమార్చి ప్రతీకారం తీర్చుకుంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వైమానిక దళానికి చెందిన 2 వేల విమానాలు ఆ ప్రాంతంలోని ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలపై సుమారు 100 కిలోల బాంబులను జారవిడిచాయి. ఇంత జరిగినా పాక్‌కి తెలియదు. ఈ దాడికి బాలాకోట్ ఎయిర్ స్టైక్స్ అని పేరు. ఇదే సమయంలో MIG 21 యుద్ధ విమాన పాకిస్తాన్ f16 ఫైటర్ జెట్‌ను కూల్చేసింది. ఈ దాడిలో MIG21 యుద్ధ విమానం దెబ్బతిన్నది. దాడికి గురై, అక్కడే పడిపోయింది. ఈ సమయంలోనే పాక్ సైనికులు MIG 21 పైలట్ అభినందన్ వర్ధమాన్ని పట్టుకున్నారు. అభినందన్ ను విడిచిపెట్టాలని అమెరికాతో పాటు పలు దేశాలు పాక్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. దీంతో 2019, మార్చి ఒకటిన పాక్ అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేసింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం అభినందన్‌ను ‘‘వీర చక్ర’’ అన్న పురస్కారంతో సత్కరించింది కూడా.
ఫిబ్రవరి 14వ తేదీకి ఇంతటి వారసత్వం ఉంది. మన సైనిక సోదరుల పోరాట స్ఫూర్తిని మన అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఇది. అంతేకానీ వాలెంటైన్స్ పేరుతో వికృతంగా వ్యవహరించడం తగని పని.