మోదీ అంటేనే మొండి ఘటం.. Features of Putin Tour || Modi Putin meet
…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈసారి భారత పర్యటన చాలా ప్రాధాన్యత కలిగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ఒక వైపు కారాలు, మిరియాలు నూరుతున్నారు. రష్యాతో వ్యాపారం చేసినందుకే ఆంక్షలు విధించి హడావుడి చేశారు. అటువంటిది, స్వయంగా పుతిన్ భారత్ లో పర్యటించటం, అతిథి మర్యాదలు చేయటం అంటే మాటలు కాదు. దీినిని బట్టి అమెరికా సహా అగ్ర దేశాలకు నరేంద్రమోదీ ఒక ఛాలెంజ్ విసురుతున్నారు.
………
పుతిన్ భారత్ లో అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం చెప్పారు.. ప్రోటోకాల్ పక్యన పెట్టి స్వాగతం చెప్పటం… ఈ పర్యటనకు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసింది. పుతిన్‌పై ఉన్న కళ్లు చెదిరే భద్రతా ఏర్పాట్లు, అదిరిపోయే ఆతిథ్యం — ఇవన్నీ కలిసి ఈ పర్యటనకు ప్రత్యేక ఆకర్షణ ను తెచ్చి పెట్టాయి.
……
మరో, ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒకే వాహనంలో మోదీ, పుతిన్ కలిసి ప్రయాణించడం. ఇద్దరు అగ్రనేతలు ఇలా కలిసి ప్రయాణించటం చాలా చాలా అరుదు. ఈ పర్యటనలో మరో విశేషం — ప్రధాని మోదీ స్వయంగా పుతిన్‌కు భగవద్గీతను బహుమతిగా ఇవ్వడం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు నిలువెత్తు ప్రతీక.
……..
ఈ పర్యటనలో రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, ఎనర్జీ రంగాలలో రెండు దేశాలు పలు కీలక ఒప్పందాలపై చర్చించాయి. ప్రపంచ రాజకీయాల్లో స్వతంత్ర ధోరణిని కొనసాగించడంలో రష్యా మనకు కీలక దేశంగా నిలుస్తోంది. మరోవైపు, రష్యాకు కూడా భారతదేశం ఒక నమ్మకమైన మిత్రదేశం. వ్యాపార పరంగా, భద్రతా రంగంలో, టెక్నాలజీ రంగంలో ఈ పర్యటన భవిష్యత్‌కు బలమైన పునాది వేసింది. మొత్తంగా చూస్తే పుతిన్ భారత పర్యటన రాజకీయ పరంగా మాత్రమే కాదు, ఆర్థిక, సంస్కృతిక, వ్యూహాత్మక రంగాల్లో కూడా రెండు దేశాలకు ప్రయోజనకరంగా నిలిచింది.
………
ట్రంప్ వంటి నాయకులు కడుపు మంట తెచ్చుకొంటున్నారు అని తెలిసినప్పటికీ, మోదీ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. భారత ఆత్మ గౌరవం విషయంలో మోదీ … ఒక మొండి ఘటం అని మరోసారి రుజువు అయింది.

