కన్నడ రచయిత, ఉల్లాల్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇదినబ్బ కుమారుడు బీఎం బాషా ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. టెర్రరిస్ట్ గ్రూప్ ఐసిస్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో…. బాషా కోడలైన మందడిగట్టు సదానంద మర్ల దీప్తి అలియాస్ మరియంను కస్టడీకి తీసుకున్నారు. మంగళూరు సమీపంలోని మస్తికట్టెలా వారుంటున్నారు. సోమవారం ఎన్ఐఏ ఆ ఇంట్లో దాడులు చేసింది.
ఎన్ఐఏ డిప్యూటీ ఎస్పీ కృష్ణకుమార్ నేతృత్వంలోని బృందం ఈ సోదాలు చేసింది. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. మరియంను మంగళూరు స్థానిక కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు. కర్నాటక పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టినట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. మర్ల దీప్తి అలియాస్ మరియంకు ఐసిస్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతోనే దాడులు చేసినట్టు చెప్పారు.
గతేడాది ఆగస్టులోనూ అనాస్ అబ్దుల్ రహ్మాన్ కజిన్ అయిన అమర్ ను ఎన్ఐఏ ఇదే ఇంట్లో అదుపులోకి తీసుకుంది. ఐసిస్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతోనే అమర్ ను అరెస్ట్ చేసిన ఏజెన్సీ ఇప్పుడు మరియంను అదుపులోకి తీసుకుంది. ఈ ఐదు నెలల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కీలక సమాచారాన్ని, ఆధారాల్ని సేకరించింది.
మరియం అలియాస్ దీప్తి కొంతకాలంగా ఐసిస్ సభ్యుడైన అజ్మల్ తో టచ్ లో ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని కర్నాటక పోలీసులూ తెలిపారు. అజ్మల్ ఇదినబ్బ మనవరాలు. ఆయన కుమార్తె తనయ. ఆమె కొంతకాలం సిరియాలో ఉండి వచ్చింది. తను హార్డ్ కోర్ ఐసిస్ మెంబర్. హిందువు అయిన మర్యమ్ బాషాను పెళ్లాడి ముస్లిం అయింది. దీప్తి మర్లా ఆమె అసలు పేరు. యూఏఈలో చదివింది. అక్కడ ఇస్లాం వైపు ఆకర్షితురాలై ముస్లింను పెళ్లిచేసుకుని తను కూడా మతం మారింది.
గత మార్చిలోనే ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. తరువాత మహ్మద్ అమీన్ అలియాస్ అబూ యాహ్యాతో పాటు మరో ఇద్దరు డాక్టర్ రషీద్, ముస్హబ్ అన్వర్ ను అరెస్ట్ చేసింది. తరువాత ఆగస్టులో అమర్ సహా మరోనలుగురిని అదుపులోకి తీసుకుంది. అప్పుడే వెస్ట్ ఏషియా వెళ్లి ఐసిస్ లో చేరేందుకు సిద్ధమైన మరో ఇద్దరు యువతుల్నీ ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
దీప్తి మర్లా, మహ్మద్ అమీన్ 202 మార్చిలో హిజ్రత్ కోసం కశ్మీర్ వెళ్లినట్టు, తరువాత సిరియా, ఇరాక్ లో పనిచేస్తున్నవాళ్లతో టచ్ లోకి వెళ్లినట్టు దర్యాప్తులో తేలింది. అప్పటినుంచి ఐసిస్ ఉగ్రగ్రూపునకు సహాయసహకారాలు అందిస్తున్నారు. మహ్మద్ అమీన్ తో కలిసి దీప్తి మర్లా పలు ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్టు సమాచారం.
ఐసిస్ కోసం ఫండ్ రైజింగ్ చేస్తున్న 11 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అమర్ కోడలైన అజ్మల్, ఆ తరువాత మరియం కలిసి …యువతీ యువకులను ఐసిస్ లో చేరేలా ప్రోత్సహిస్తూ ఫండ్ కలెక్ట్ చేస్తున్నట్టు తేలింది.
అలా కేరళకే చెందిన 13మందిని ఐసిస్ లో చేరేందుకు సిద్ధం చేశారు. ఇదంతా 2016లో జరగగా… 2017లోనే పూర్తి ఆధారాలు, వివరాలతో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. అజ్మల్, ఆమె భర్త షఫియా 2016లో భారత్ వదిలి ఆఘ్గనిస్తాన్లోని నాన్గర్ ప్రావిన్స్ కెళ్లిపోయారు. ఆ సమయంలో కేరళకు చెందిన 21 మందిని వారు ఐసిస్ లో చేర్చారు. వారంతా దేశం విడిచి వెళ్లారు.
అహ్మద్ అమీన్, అతని సహచరులు ఇన్ స్టాగ్రామ్, హోప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా ప్రచారం చేస్తూ యువతను ఐసిస్ కు రిక్రూట్ చేస్తున్నారు.
https://twitter.com/ANI/status/1478046150187831298?s=20