కశ్మీర్లో టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. కుల్గాం జిల్లాలోని గోపాల్పోరా ప్రాంతంలో ఓ ఉపాధ్యాయురాలిని హత్య చేశారు. హత్య గురించి కశ్మీర్ జోన్ పోలీసులు మే 31న ట్విట్టర్లో షేర్ చేశారు. హత్యకు గురైన ఉపాధ్యాయురాలు సాంబా జిల్లాకు చెందిన రాజ్ కుమార్ భార్య రజనీ బాలా.. గోపాల్పోరా ప్రాంతంలోని ఒక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం కొందరు ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపారు. లోయలో హిందూ వలసదారులను ఇస్లామిక్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడం ఒక వారం వ్యవధిలో ఇది రెండో సంఘటన.. ఈ నెలలో ఇది మూడోది.
#Terrorists #fired upon one woman #teacher at High School Gopalpora area of #Kulgam. In this #terror incident, she has received #critical gunshot injuries. Being shifted to hospital. Area has been #cordoned off. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) May 31, 2022
కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహిళా ఉపాధ్యాయురాలికి బులెట్ తగిలి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది.
#KulgamTerrorIncidentUpdate: Injured lady teacher, a #Hindu & resident of Samba (Jammu division) #succumbed to her injuries. #Terrorists involved in this #gruesome #terror crime will be soon identified & neutralised.@JmuKmrPolice https://t.co/8rZR3dMmLY
— Kashmir Zone Police (@KashmirPolice) May 31, 2022
ఘటనా ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు, ఈ దారుణ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. త్వరలో ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెడతామని కశ్మీర్ పోలీసులంటున్నారు.
ఉపాధ్యాయురాలి హత్యపై నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్య చేశారు. “అభి మారే జాయేంగే సబ్(ఇంకా చాలా మంది చనిపోతుంటారు)” అని అబ్దుల్లా చేసిన కామెంట్ కలకలం రేపుతోంది.
https://twitter.com/TNNavbharat/status/1531542954292441088?s=20&t=BXB2MU6H_JUf-uZh2Tv-PQ