ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ డ్రోన్ తో అద్భుతాన్ని చిత్రీకరించారు.
వందలాదిగా గొర్రెలు ఒకేసారి కదులుతూ..ముందుకు సాగుతున్న తీరును కెమెరాలో బంధించాడు. ఆ వీడియోలో గొర్రెల కదలికల్ని ఫాస్ట్ పార్వర్డ్ పద్దతిలో ఒకసారి.. స్లో మోషన్లో ఓసారి చూపెట్టాడు. పాములా మెలికలు తిరుగుతూ ఓసారి…జలపాతాల్లా ఓసారి.. పక్షి ఆకారంలో కదులుతూ మరోసారి కనువిందు చేసింది. ఇందుకు దాదాపు ఏడు నెలలపాటు శ్రమించాడాఫొటోగ్రాఫర్.