ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే కన్నుమూశారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. కోల్‌కతాలో తన ప్రదర్శన తర్వాత కేకే మరణించారు. ఆయన నజ్రుల్ మంచ్‌లో ఒక సంగీత కచేరీలో పాల్గొన్నారు. షో తర్వాత కేకే గ్రాండ్ హోటల్‌కి వెళ్లి కుప్పకూలిపోయారు.హోటల్ సిబ్బంది కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMRI) ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆయన హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, అస్సామీ సహా గుజరాతీ చిత్రాలలో పాటలుపాడారు.
కేకే ఆకస్మిక మృతిపట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది,
కుటుంబ సభ్యుల సమ్మతి.. బాడీ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ తర్వాత విచారణ, పోస్ట్‌మార్టం నిర్వహిస్తారు. కేకే మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక కోసం దర్యాప్తు అధికారులు ఎదురుచూస్తున్నారు.