దేశ రాజధాని సమీపంలో ఘోరం జరిగింది. ఓ యువకుడిని అతని ప్రియురాలి కుటుంబం దారణంగా హత్య చేసింది. కారణం తను మతం మారడానికి నిరాకరించడమే . ఈ దారుణకాండలో హతుడు హిందూ యువకుడు కాగా…అతన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఓ ముస్లిం కుటుంబం. ఢిల్లీ రఘువీర్ నగర్ కు చెందిన డబ్లూసింగ్ అలియాస్ బాదల్ అనే స్థానికంగా ఉండే ముస్లిం యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులు మాత్రం అతన్ని ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి తెచ్చారు. అలా అయితే పెళ్లిచేస్తామని షరతు పెట్టారు. కానీ అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో ప్రియురాలి కుటుంబం అతన్ని హత్యచేసింది. డబ్లూను చంపేసిన ప్రదేశానికి సరిగ్గా రెండు కిలోమీటర్ల దూరంలోనే 2018లో అంకిత్ సక్సేనా అనే యువకుడిని ఇదే కారణంతో పొట్టనపెట్టుకున్నారు.