నిత్యం భారత్ పై విషం చిమ్ముతూ ఫేక్ న్యూస్ ప్రచారంలో ముందుండే ది వైర్ వ్యవస్థాపక సంపాదకుడు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక అతిథి అయ్యాడు. భారత్ పై ఆంక్షలు విధించాలని అమెరికాను కోరి.. ఆంక్షలపై హర్షం వ్యక్తం చేసిన వామపక్ష జర్నలిస్ట్ సిద్ధార్థ వరదరాజన్ తో ఇక్కడి అధికారులకు శిక్షణా తరగతులు ఇప్పిస్తున్నారు తెలంగాణ సీఎం. గోబెల్స్ తరువాత ఆ స్థాయిలో ఫేక్ న్యూస్ సృష్టికర్త వరదరాజన్.
హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డీ ఇన్ స్టిట్యూట్ వేదిగ్గా ఆలిండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీస్ అధికారులకు ప్రత్యేకంగా ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా గెస్ట్ లెక్చర్ ఇచ్చేందుకు వామపక్ష మేధావి, ఫేక్స్ ను స్ప్రెడ్ చేసే వరదరాజన్ ను కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు.
జనవరి 17నుంచి ఏప్రిల్ 28 వరకు జరిగే కోర్సులో భాగంగా పలు కార్యక్రమాలు రూపొందించారు. అందులో భాగంగా కొన్నిసెషన్ల నిర్వహణ కోసం వరదరాజన్ ను ఆహ్వానించింది ప్యానెల్. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు జాతీయవాదులు, నెటిజన్లు. లేచింది మొదలు దేశానికి, హిందువులకు వ్యతిరేకంగా ప్రచారం చేసే సిద్ధార్థ వరదరాజన్ ను కేసీఆర్ స్వయంగా ఆహ్వానించడమేంటని వారంటున్నారు. దేశంపై విషం చిమ్మే ఇలాంటి వ్యక్తులను ఎలా ప్రోత్సహిస్తున్నారంటూ… కేంద్ర ఐటీ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్, హోంమంత్రి అమిత్ షా తదితరులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు పలువురు. షెడ్యూల్ ప్రకారం వరదరాజన్ సెషన్ జనవరి 21న ఉంది. ప్రస్తుత సమాజంలో సోషల్మీడియా సహా మీడియా పాత్ర అనే అంశంపై ఆయన క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది.
భారత్ కు వ్యతిరేకంగా విషం చిమ్మడం, ఫేక్స్ వార్తలు ప్రచారం చేయడం తప్పమరో పనిలేని జర్నలిజం అతనిది. ఇటీవలే కరణ్ ధాపర్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో …భారత్ పై అమెరికాఆంక్షలు విధించడమే సరైందని వ్యాఖ్యానించాడు. భారత్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని… మోదీతో బంధమే వద్దని బిడెన్ చెప్పాలని ట్వీట్ చేశారు.
గతేడాది ఏప్రిల్లో కుంభమేళా గురించి తక్కువచేసి రాస్తూ హిందువుల మనోభావాల్ని దెబ్బతీశాడు వరదరాజన్. ప్రయాగరాజ్ కుంభమేళాను హరిద్వార్ కుంభమేళాగా చూపుతూ తప్పుడు వార్తలు, ఫొటోలు ప్రచురించాడు. కుంభమేళా భక్తుల వల్లే కోవిడ్ స్ప్రేడ్ అయిందనీ ప్రచారం చేశాడు. అని ఫేక్ అని అందరూ విరుచుకుపడడంతో అఫ్పుడు క్షమాపణ చెప్పి..అదే ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇక 2021లో ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ గురించి అన్నీ తప్పుడు కథనాలు, ఫొటోలే ప్రచురించాడు. అల్లరిమూక దాడులకు సంబంధించి పూర్తి అవాస్తవాలతో కథనాన్ని వండివార్చాడు. ట్రాక్టర్ బోల్తా పడి రైతు నవ్రీత్ సింగ్ చనిపోతే దాడి చేసి చంపారంటూ తప్పుడు ప్రచారంచేశాడు. ఫేక్స్ ప్రచారం చేసి హింసను ప్రేరేపించాడంటూ… అతనిపై ఉత్తరప్రదేశ్ లో పలువురు ఫిర్యాదుచేశారు. జనాన్ని రెచ్చగొట్టారంటూ… రాంపూర్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 153B మరియు 505 కింద కేసు నమోదైంది. తబ్లిగ్ జమాతే ను రక్షించే ప్రయత్నంలో వరదరాజన్ అల్లిన వార్తలు, చేసిన కుట్రలు అన్నీఇన్నీ కావు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైన సందర్భంగా ఉదారవాదులు ఆయనకు మద్దకుగా ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటూ పెట్టిన కేకలు, అరుపులు దేశమంతా దద్దరిల్లాయి.