ఆ మధ్య వచ్చిన కల్కి సినిమా గుర్తు ఉంది కదా. ఇందులో సుప్రీం కోసం అమ్మాయిల్ని వెతుకుతూ ఉంటారు. అందమైన అమ్మాయిలను కాంప్లెక్స్ కు తరలించి సుప్రీం కోసం రెడీ ఉంచుతారు. చూడడానికి ఇది సినిమాటిక్ గా అనిపించినా… ఉత్తర కొరియాలో ప్రతి ఏటా ఇది నిశ్శబ్దంగా జరిగిపోతుంది. నియంత కిమ్ జోంగ్ ఉన్ రొమాంటిక్ అవసరాల కోసం ప్రతి ఏట పాతికమంది అమ్మాయిలను అంతఃపురానికి తరలిస్తారు. అసలు ఈ నియంత స్టైల్ ఏమిటి.., ఈ అమ్మాయిల పరిస్థితి ఏమిటి, .. అన్న విషయాలు తెలుసుకుంటే కళ్ళు తిరగాల్సిందే.
ఉత్తర కొరియా మాజీ నియంత కిమ్ జోంగ్ ఇల్ ముగ్గురు కుమారుల్లో ఆఖరి కొడుకే జోంగ్ ఉన్. కొరియా మిలిటరీ యూనివర్సిటీలో చదువుకుని, సైన్యంలోకి ప్రవేశించాడు. తండ్రి అనారోగ్యంతో మంచం పెట్టినప్పుడు సైన్యం మీద గ్రిప్ సంపాదించడం జరిగింది. 2011 వ సంవత్సరంలో తండ్రి చనిపోయినప్పుడు వెంటనే పరిపాలన పగ్గాలు చేపట్టాడు. రెండు వారాలు తిరగకుండా పార్టీ అధ్యక్ష పదవి, సైనిక అధ్యక్ష పదవి, దేశాధ్యక్ష పదవిని తీసేసుకున్నాడు. ఇద్దరు అన్నగార్ల కుటుంబాలను పక్కకు జరిపేయడం జరిగింది. కుటుంబ సభ్యుల్ని వేధించడం చూసి మేనత్త జాంగ్ కైసన్ కలగజేసుకునేందుకు ప్రయత్నం చేశారు. మాట్లాడుకుందాం రమ్మని పిలిపించి మేనత్త , ఆమె భర్త , వాళ్ళ కుమారుడు ని …. అందరి ముందు కాల్చి చంపేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అంతా కిమ్ జోంగ్ ఉన్ జోలికి రావడం మానేశారు. ప్రభుత్వంలో, పార్టీలో ఎదురు తిరిగిన వారిని అక్కడికక్కడే కాల్చి చంపడం ఆయన అలవాటు.
దేశవ్యాప్తంగా కూడా కఠినమైన ఆంక్షలను అమలు చేస్తూ ఉంటారు. అసలు ఉత్తర కొరియాలో ఎటువంటి పాలన జరుగుతుందో కూడా పెద్దగా బయట ప్రపంచానికి తెలియదు. పూర్తిగా కమ్యూనిస్టు నియంత పాలనలో మగ్గిపోతూ ఉంటుంది. కానీ భారీ ఆయుధ సంపత్తి సమకూర్చుకుని, పాశ్చాత్య దేశాలకు సవాల్ విసురుతూ ఉంటారు.
ఇక అసలు పాయింట్ కి వద్దాం. నియంత కిమ్ జోంగ్ ఉన్ చాలా శృంగార పురుషుడు అని చెప్తారు. ఆయన కోసం ప్రతీ సంవత్సరం పాతికమంది అందమైన అమ్మాయిలను తరలిస్తుంటారు. అక్కడ విషయాలను.. అంతఃపురం నుంచి పారిపోయి …బయటకు వచ్చిన యోన్ పార్క్ అనే అమ్మాయి విదేశీ మీడియాకు వెల్లడించింది. ఆమె చెబుతున్న వివరాలు వింటే సాక్షాత్తు కల్కి సినిమా కాంప్లెక్స్ సీన్స్ కళ్ళ ముందు కనిపిస్తాయి.
నియంత కిమ్ ను సంతోష పెట్టే అమ్మాయిల కోసం ప్రతి సంవత్సరం వెతుకుతూ ఉంటారు. కాలేజీలు , స్కూల్స్, ట్రైనింగ్ సెంటర్లలో పోలీసు అధికారులు సోదాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో దాక్కుని ఉన్న అమ్మాయిల్ని బయటకు తెచ్చేందుకు స్కూల్ గ్రౌండ్స్,, వాష్ రూమ్ లను కూడా వదిలిపెట్టరు. అందంగా ఉన్న అమ్మాయిలను ఒక చోటకు చేర్చి ఫిట్నెస్, బాడీ షేప్స్ ఆధారంగా రెండు మూడు గ్రూపులుగా విడగొడతారు. తర్వాత ఈ అమ్మాయిలకు ఆరోగ్య పరీక్షలు చేయించి సంపూర్ణ ఆరోగ్యవంతులు అయితేనే తీసుకుంటారు. అలాగే కన్యత్వ పరీక్షలు కూడా తప్పనిసరి. పరీక్షలో పాజిటివ్ అని తెలిస్తేనే ఎంపిక చేస్తారు. ఇక తర్వాత ఆ అమ్మాయి భావజాలం, కుటుంబ నేపథ్యం గురించి ఆరా తీస్తారు. విదేశాలతో సంబంధం ముఖ్యంగా దక్షిణ కొరియాతో ఏ చిన్న అనుబంధం ఉన్నా పక్కకు తప్పించేస్తారు. ఈ పరీక్షలు అన్నీ పూర్తయ్యాక రాజధాని ప్యాంగ్ యాంగ్ కి చేరుస్తారు. అక్కడ ఫైనల్ పరీక్షలు పూర్తయ్యాక 25 మందిని ఎంపిక చేసి అంతఃపురంలోకి తరలిస్తారు. అక్కడినుంచి వాళ్ళ కుటుంబానికి ప్రతి నెల జీతం పంపించేస్తారు.
ఇదంతా అచ్చుగుద్దినట్టు కల్కి సినిమా మాదిరిగానే జరుగుతూ ఉంటుంది. ఎంపికైన 25 మందికీ సీనియర్ అమ్మాయిలతో ట్రైనింగ్ చెప్పిస్తారు. ఇక అక్కడ నుంచి వాళ్లకు మిగిలిన ప్రపంచంతో సంబంధం కట్ అయిపోతుంది. ఈ అమ్మాయి లను మూడు గ్రూపులుగా విడగొడతారు. ఒక గ్రూపును మసాజ్ చేయడానికి రెడీ చేస్తారు. మరో గ్రూపు ను పాటలు పాడడం, డాన్స్ చేయటానికి ఉపయోగిస్తారు. ఇక మూడో గ్రూపు పూర్తిగా బెడ్ మీద రొమాన్స్ కోసం పంపించేస్తారు. ప్రతినెల ఈ గ్రూపులను రొటేషన్ ద్వారా మారుస్తూ ఉంటారు. ఈ టీమ్ ను ప్లెజర్ స్క్వాడ్ అని పిలుస్తారు.
అయ్యగారిని అన్ని రకాలుగా సంతోష పెట్టడమే ఈ టీం చేయాల్సిన పని. ఏడాది తర్వాత ఈ టీం పక్కకు వచ్చేస్తుంది. ఇందులో బాగా నచ్చిన అమ్మాయిలను మాత్రం అంతఃపురంలోనే ఉంచుతారు. మిగిలిన అమ్మాయిలను పక్కమందిరంలోకి మార్చేస్తారు. సైన్యంలోనూ ప్రభుత్వం లోనూ… సీనియర్ అధికారులు,, మంత్రులను సంతోషపరచడమే వాళ్ళ పనిగా మారుతుంది. కొంతకాలం తర్వాత వాళ్లను ప్యాలస్ లోని ఇతర ఉద్యోగాల్లోకి తీసేసుకుంటారు. మరికొందరికి అక్కడ ఉండే గార్డులను ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఇలా ప్రతి సంవత్సరము అమ్మాయిల కోసం వేట సాగుతుందని పార్క్ అనే ఈ అమ్మాయి వెల్లడించింది. అక్కడి నుంచి తప్పించుకుని బయటకు రావడం చాలా చాలా కష్టమైన పని అని, దొరికితే చావు తప్ప మరో మార్గం ఉండదని వివరించారు.
మొత్తానికి ఈ ఆధునిక కాలంలో కూడా భూమండలం మీద ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి అంటే వినటానికి ఆశ్చర్యమే. కానీ నియంతల పాలనలో ఇలాంటివి సహజమే.