17 తరువాత ఫేస్ బుక్ సంస్థ పేరు మార్చారు సీఈవో మార్క్ జుకర్ బర్గ్. ఇక నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ , మెసెంజర్, వాట్సాప్లూ ఒకే గొడుగు కింద ఉండి మెటాపేరుతో ఉంటాయి.
ఈ మేరకు జుకర్ తన కంపెనీ కొత్త పేరు, లోగోను ప్రకటించారు. నిజానికి దీని పూర్తి పేరు మెటావర్స్. సంక్షిప్తంగా మెటా.
అయితే యాప్ పేర్లు మాత్రం మారవు. ఫేస్ బుక్ కూడా అదే పేరుతో కొనసాగుతుంది. మాతృసంస్థను మాత్రం మెటాగా వ్యవహరించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో సంస్థ ఏం చేయబోతుందనే విషయాల్ని ఫేస్ బుక్ అనే పదంతో నిర్వహించలేమని….తమ విస్తరణకు ఆ పదం చిన్నదైపోయిందని… కొత్త పేరు మెటా అన్ని యాప్స్ లనూ రిప్రెజెంట్ చేస్తుందనీ జుకర్ అన్నారు.
లోగో మార్పే కాదు… ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ ఆధారిత సేవలకు చిరునామాగా మారాలనే లక్ష్యాన్ని మెటా నిర్దేశించుకుంది.
అయితే పేరు మార్పునకు అసలు కారణం వేరే ఉదంటున్నారు నిపుణులు. ఈ మధ్య కాలంలో తరుచూ ఫేస్ బుక్ పై విమర్శలు వస్తున్నాయి. వాట్సప్ పై కూడా..ప్రైవసీ పాలసీపై దుమారం రేగింది. ఆ వ్యతిరేక భావనను ఎదుర్కొనేందుకు భారత్ వంటి దేశాల్లో టెలిగ్రాం వాడకం కూడా పెరిగిన నేపథ్యంలో వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే సంస్థ పేరు మార్పే ఉత్తమమని జుకర్ భావించాడని అంటున్నారు. ఇకపై కంపెనీ స్టాక్స్ అన్నీ మెటావర్స్ తోనే లిస్ట్ అవుతాయి.