బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. 2024 జూన్ వరకు ఆయన్నే కొనసాగిస్తూ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది మొదట్లో జరిగే లోక్ సభ ఎన్నికలకు ఆయన సారథ్యంలో వెళ్లడమే మంచిదని పార్టీ భావించింది. ఆయన అధ్యక్షతన పలు విజయాలు అందుకున్నామన్న అమిత్ షా…బెంగాల్, తెలంగాణలో పార్టీ బలోపేతం అయిందని అన్నారు. ఇక వచ్చే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచితీరాలని నాయకులకు స్పష్టం చేశారు నడ్డా. ఆపై 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం మనదే కావాలని అన్నారు. ఈమేరకు ఎన్నికల సన్నద్ధతపై, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.