పంజాబ్ లుథియానాలోని జిల్లా కోర్టులో జరిగిన పేలుడులో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కోర్ట్ కాంప్లెక్స్ రెండో ఫ్లోర్ బాత్రూంలో మధ్యాహ్నం పన్నెండున్నరకు ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు గోడలు కూలాయి. కిటికీ అద్దాలు పగిలాయి.ప్రమాదానికి పూర్తి కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు వెంటనే సహాయచర్యలు మొదలుపెట్టారు. ఘటనపై సీఎం చరణ్ సింగ్ చన్నీ ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కావాలనే పంజాబ్ లో దేశ వ్యతిరేక శక్తులు ఇలాంటి చర్యలకు దిగుతున్నాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు.