సత్యాన్వేషకులు, వాస్తవ చరిత్ర తెలుసుకోవాలనుకునేవారందరూ ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను తప్పక చూడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నటి పల్లవీజోషీని ఢిల్లీలో కలిశారాయన. వాస్తవగాథను తెరకెక్కించినందుకు అభినందించారు. డైరెక్షన్, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, బాగున్నాయని ఎంతో పరిశోధన చూసి నిజాలు చెప్పారంటూ అభినందించారు.