
Vivek Agnihotri 9director of ‘The Kashmir Files’)
‘ది కశ్మీర్ ఫైల్స్” పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ప్రతీ ఫ్రేమ్, ప్రతీపదం వాస్తవమని ఎక్కడైనా, చివరకు కోర్టులైనా నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు. సినిమా విడుదలను నిలిపేయాలంటూ ఇంతేజార్ హుస్సేన్ సయ్యద్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసందే. అయితే తాను అస్సలు మౌనంగా ఉండబోనని వివేక్ స్పష్టం చేశారు.
ద కశ్మీర్ ఫైల్స్ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. అయితే అది పూర్తిగా ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ పిటిషన్ వేశాడు యూపీకి చెందిన ఇంతేజార్ హుస్సేన్ సయ్యద్ . అయితే సయ్యద్ ఆరోపణల్ని కొట్టిపారేసిన వివేక్ అగ్నిహోత్రి తన సినిమాలో నిజాలు మాత్రమే చెప్పానన్నారు.
BREAKING: PIL by one Intezar Hussain Sayed, an Uttar Pradesh Inhabitant to stall release of #KashmirFiles, directed by @vivekagnihotri before Bombay High Court, says “Trailer hurts religious feelings of Muslim Community”, “inflammatory scenes bound to cause communal violence” pic.twitter.com/oz0YM4MP8P
— LawBeat (@LawBeatInd) March 3, 2022
మూవీలో కశ్మీరీ హిందువులపై జరిగిన మారణహోమాన్నికళ్లకు కట్టాడు అగ్నిహోత్రి. సినిమా నిలుపుదల చేయాలంటూ కొందరు కోర్టుకెళ్లడంపై మండిపడ్డారు. తాను సినిమాలో చూపించిన ప్రతీ ఫ్రేమ్ నిజమని ఏ వేదికనుంచైనా నిరూపించేందుకు సిద్ధమని సవాల్ చేశాడు. పిటిషన్ వేయడం ద్వారానో , మరో రకంగానో అఢ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని…తాను ఎట్టిపరిస్థితుల్లోనూ మౌనంగా ఉండబోననీ అన్నాడు.
ట్రైలర్లో చూపిన సన్నివేశాలు మతహింసను ప్రేరేపించాలా ఉన్నాయంటూ పిల్ వేశారు సయ్యద్. జాతి వివక్షతో కూడిన డైలాగులూ ఉన్నాయంటున్నాడు.
సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 21న యూట్యూబ్‌లో విడుదలైంది. జీ స్టూడియోస్ దాన్ని అప్లోడ్ చేసింది. మొదట్లోనే బ్యాక్ డ్రాప్ వాల్ పై ముసల్మాన్ జాగో కాఫీర్ అంటే హిందువులు భాగో అని రాసి ఉన్న గ్రాఫిక్ ను సయ్యద్ ప్రస్తావిస్తూ మతాల మధ్య విద్వేషాలు పెంచేలా ఉందన్నారు. సినిమా వల్ల దేశంలో మతహింస చెలరేగే ప్రమాదం ఉందని కోర్టుకెళ్లాడు. సినిమా విడుదలను అడ్డుకోవడమే కాదు… యూట్యూబ్ సహా ఇతర సోషల్‌మీడియా ప్లాట్ ఫాంలనుంచి ట్రైలర్ ను తొలగించాలనీ కోరాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం సినిమా విడుదలను ఆపేయాలన్నాడు.
అటు షియా ముస్లింల మతనాయకుడైన అయతుల్లా ఖమేనీ పాత్రను సినిమాలో చూపడంపై ఆ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఖమేనీని టెర్రరిస్టుగా చూపారని వారంటున్నారు. ఐ అండ్ బీ మంత్రికీ తమ అభ్యంతరం చెబుతూ లేఖ రాశారు. ఈ అంశంపైనా అగ్నిహోత్రి స్పందించారు. సినిమాలో చిత్రీకరించిన ప్రతి డైలాగ్, సన్నివేశం, పాత్రకు తాను బాధ్యత వహిస్తానని తాను వాస్తవాలే చెప్పానని కోర్టులోనే ప్రూవ్ చేస్తానని… వందలాది రెఫరెన్సులు, వీడియోలు, విజువల్ సోర్స్‌లు తనదగ్గరున్నాయని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అగ్నిహోత్రి. కశ్మీర్లో చాలా ఏళ్ల పాటు జరిగిన మారణకాండను చూపానని…ఫత్వాలతో పోరాటాలు చేయదగలిగినప్పుడు కేసులు పెద్ద విషయం కాదనీ వ్యాఖ్యానించారు.
“ది కశ్మీరీ ఫైల్స్ ‘ ట్రైలర్ ను అప్లోడ్ అయిన 10 రోజుల్లో దాదాపు కోటి మంది చూశారు. మూవీ మార్చి 11 న విడుదలకు సిద్ధమైంది.