ప్రజల టాక్స్ సొమ్ము మీడియాకు లంచాలుగా ప్రకటనల రూపంలో ఇస్తూ ఎంత దరిద్రంగా, ఏ అభివృద్ధి లేకుండా పాలించినా, మీడియా ఒక్క విమర్శ చేయకుండా ఇంద్రుడు చంద్రుడు అని పొగిడించుకుంటూ అధికారంలో సాగే విధానం కేజ్రీ ఆప్ పార్టీ బాగా నేర్చుకుంది.
ఏ టివి ఛానల్ ఏ భాషలో పెట్టండి ఢిల్లీ ,పంజాబ్ రాష్ట్ర ప్రకటనలు అలా కనిపిస్తూనే ఉంటాయి.
ఏ మేధావి ఒక్క మాట కూడా విమర్శించని క్రేజ్రి మార్క్ పాలన ఇది.
నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారా? అయితే
ఈ ఉదాహరణలు చూడండి…
1. బయో కంపోస్టింగ్ ప్రోగ్రామ్ కి ఖర్చు చేసింది కేవలం
₹40 వేలు. దాని ప్రకటనలకు ఖెర్చు చేసింది అక్షరాల
₹7 కోట్లు (the wire ఆర్టికల్ dt 05.03.2021)
2. పంటల చెత్త తగలెట్టడానికి వాడే స్ప్రే మీద 68.లక్షలు ఖర్చు చేస్తే ఆ స్కీం ప్రకటనల మీద ₹23,కోట్లు ఖర్చు
(న్యూస్ లాండ్రి రిపోర్ట్ 11.05.2022)
ఈ రెండూ ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి స్కాం ఢిల్లీ ప్రభుత్వంలో ప్రతీ డిపార్ట్మెంట్ లో జరిగాయి. అతి చిన్న రాష్ట్రం ఢిల్లీకి 2013లో షీలా ముఖ్యమంత్రి గా సం. కి ₹11 కోట్లు ప్రకటనల రూపంలో ఖర్చు చేస్తే కేజ్రీ ఇప్పుడు సం. కి 440.కోట్లు ఖర్చు చేస్తున్నాడు అంటే మీడియాకు ఎంత ముట్ట చెపుతున్నాడో చూడండి.
ఖాజానాలో పైసా లేకపోయినా పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం వచ్చాక ఇలాగే ప్రకటన ల మీద ఖర్చు చేయడం మొదలైంది. అందుకే మీడియా లో కేజ్రీ మీద ఆప్ మీద విమర్శలు రావు కుక్క బిస్కెట్లు తిన్నంత విశ్వాసంగా వాళ్ళ కాళ్ళు నాకుతుంది మీడియా.
పాత కాలంలో ఒక సామెత ఉండేది. ‘పావలా కోడికి ముప్పావలా మసాలా’ అని. అలా ఉంది పంజాబ్ ప్రభుత్వం పని తీరు. అది కూడా పక్కింటి కోడికి.
విషయానికి వస్తే ‘ఆపు’ ప్రభుత్వం ఢిల్లీలో ‘మొహల్లా క్లినిక్స్’ ప్రారంభించింది. అదే తరహాలో పంజాబ్ లో కూడా 75 ‘మొహల్లా క్లినిక్స్’ ప్రారంభించింది. మరి కొన్ని ‘మొహల్లా క్లినిక్స్’ కూడా రిపబ్లిక్ డే లోపల ప్రారంభిస్తోందట. అంతవరకు సంతోషించవలసిందే.
అయితే ఈ ‘మొహల్లా క్లినిక్స్’ గురించి తమిళనాడులో ప్రచారం కోసం అక్షరాలా ₹.30 కోట్లు కేటాయించమని పంజాబ్ ఛీఫ్ సెక్రెటరీగారు ఆరోగ్యశాఖ కమీషనర్ అజయ్ శర్మను కోరారు.
పంజాబ్ లో కేవలం ₹.10 కోట్లతో 75 మొహల్లా క్లినిక్స్ ప్రారంభం కావడానికి కారకుడైన అజయ్ శర్మ తమిళనాడులో ప్రచారానికి ₹.30 కోట్లు కేటాయించడానికి ‘నో’ అన్నారు.
సాయంత్రంకల్లా శర్మ సారుని బదిలీ చేసారు. అదేమని అడిగితే ‘మామూలు బదిలియే’ అని జవాబిచ్చారట ఛీఫ్ సెక్రెటరీగారు.
‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు భగమానుడా’