సుప్రీంకోర్ట్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులవనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే ఆయన రమణ పేరును ప్రతిపాదించారు. ఈ మేరకు న్యాయశాఖకు ఆయన లేఖ రాశారు. కేంద్రన్యాయశాఖ ఈ ప్రతిపాదనను హోంశాఖకు పంపనుంది. హోం శాఖ పరిశీలన అనంతరం రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక పూర్తవుతుంది. ఏప్రిల్ 23న బోబ్డే పదవీ విరమణ చేస్తారు. 24న రమణతో రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయిస్తారు. 2022 ఆగస్టు 26 వరకు ఎస్వీ చీఫ్ జస్టిస్ గా కొనసాగుతారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో జన్మించిన ఎన్వీరమణ 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా, దిల్లీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఆయన…2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.