భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చత్తీస్ గఢ్ సరిహద్దు పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు. ఇది గ్రేహౌండ్స్ బలగాలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డిఆర్జి , సిఆర్పిఎఫ్ బలగాల ఉమ్మడి ఆపరేషన్ అని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు.
పెసలపాడు ప్రాంతంలో మావోయిస్టుల బృందం బస చేస్తున్నట్లు తమకు పక్కా సమాచారం అందిందని…పోలీసులపై దాడి చేసేందుకు ఐఈడీ(ఇంప్రొవైజ్డ్ ఎక్సప్లోజివ్ డివైస్)లను సిద్ధం చేస్తున్నట్లు తెలిసిందని ఎస్పీతెలిపారు. దీంతో ఛత్తీస్‌గఢ్ బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాయన్నారు.ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటలమధ్య ఎన్ కౌంటర్ జరిగినట్టు తెలిసింది. మృతుల్లో నలుగురు మావోయిస్టులు, చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.