జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు అలజడి మళ్లీ మొదలైంది. పుల్వామా జిల్లాలో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో కాకపోరా ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండటంతో.. పోలీసులు, భద్రతా బలగాలు ఎదురు కాల్పులు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు స్పాట్లోనే హతమయ్యారు. అయితే మృతిచెందిన ముగ్గురు ఉగ్రవాదులు.. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని నౌగామ్‌లోని బీజేపీ నేత ఇంటిపై కాల్పులు జరిపిన వారేనని.. కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
Three militants involved in attack on BJP leader's residence in J-K's Nowgam killed in Pulwama encounter: IGP, Kashmir, Vijay Kumar
— Press Trust of India (@PTI_News) April 2, 2021
Jammu and Kashmir: Police and security forces are carrying out an operation at Kakapora area in Pulwama district where an encounter is underway. Details awaited.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/53fOiiacJ1
— ANI (@ANI) April 2, 2021