కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతాదళాలు మరో విజయం సాధించాయి. కుల్గాం, అనంతనాగ్ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లో ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టుల గాలింపులో భాగంగా భద్రతా దళాలు ఆ రెండు జిల్లాల్లో వేర్వేరుగా ఆపరేషన్ చేపట్టాయి. హతమైనవారిలో ఇద్దరు పాకిస్తాన్ కు చెందిన వారు కాగా.. నలుగురు స్థానికులు. కాశ్మీర్ జోన్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ కు ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మొదట అనంతనాగ్ జిల్లా నౌగాంలో ఉగ్రవాదులు ముందుగా భద్రతాదాళాలు, పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఓ పోలీసుకు గాయాలయ్యాయి. అప్పుడే ఇటువైపునుంచి కాల్పులు మొదలుపెట్టారు. ఎదురుకాల్పుల్లో పాక్ ఉగ్రవాది సహా ముగ్గురు హతమయ్యారు. అనంతరం కుల్గామ్జిల్లా మిర్హామా వద్ద మరో ఆపరేషన్ ప్రారంభించారు. అక్కడ మరో ముగ్గురు హతమయ్యారు. చనిపోయిన ఉగ్రవాదులు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని తెలుస్తోంది.