ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. ప్రత్యర్థి మెరైన్ లే పెన్ను సునాయాసంగా ఓడించి రెండోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
ఆదివారం మొత్తం 97 శాతం ఓట్లను లెక్కించగా, మెక్రాన్ 57.4 శాతం ఓట్లను సాధించారు మెక్రాన్. తనకు ఓటేసిన దేశప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని..రాబోయే రోజుల్లో వారందరికీ రుణపడి ఉంటానని మెక్రాన్ అన్నారు. ఇక రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన మాక్రాన్ కు భారత ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.
“ఫ్రాన్స్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనందుకు నా స్నేహితుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు అభినందనలు! భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను” అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
https://twitter.com/narendramodi/status/1518418251323420673?s=20&t=jNCqvwHc-L8w8ZvshR5b_Q
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)