ఆఫ్గనిస్తాన్ సంక్షోభంనేపథ్యంలో ఆ దేశపౌరుల కోసం భారత్ ఈ వీసా దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టింది. అత్యవసర సమీక్ష నిర్వహించిన హోంశాఖ…వీసా నిబంధనల్లో మార్పు చేసింది. భారత్ వచ్చేందుకు ఆఫ్గాన్లు చేసుకున్న వీసా దరఖాస్తుల ఫాస్ట్ ట్రాక్ పరిశీలన కోసం e-emergency X-Misc visa పేరుతో ప్రత్యేక కేటగిరీ ప్రవేశపెట్టింది.
ఆరునెలల కాలపరిమితితో వీసాలు మంజూరుచేయనున్నారు.
అయితే దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తారు..