ఎమర్జెన్సీ చీకటి పాలనకు 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా వినూత్న కార్యక్రమం చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, పార్లమెంటు సబ్యులు డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హైదరాబాద్ లోని కేశవ్ మోమోరియల్ లా కాలేజీ తో కలిసి సంయుక్తంగా మాక్ పార్లమెంటు నిర్వహించింది. లా కాలేజీ విద్యార్థులే స్వయంగా పార్లమెంటు కార్యక్రమం చేపట్టారు. కొంతమంది సభ్యులు కేంద్ర మంత్రులుగా, మరికొందరు అధికార ప్రతిపక్ష ఎంపీలుగా నిలిచారు. ఎమర్జెన్సీ చీకటి పాలన మీద విద్యార్థులు లోతుగా చర్చించారు.
..
కేశవ్ మోమోరియల్ లా కాలేజీ అనేక సందర్భాల్లో జాతీయ వాద సబ్జెక్టుల మీద వినూత్న కార్యక్రమాలు నిర్వహించింది. లా విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు మూట్ కోర్ట్ లు, ప్రాక్టికల్ తరగతులు, వర్క్ షాప్ లు, ఎగ్జిబిషన్ లు, సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అణచివేశారు అనేది ఈ తరం విద్యార్థులకు తెలియచెప్పేందుకు దీనిని చేపట్టారు.
…
ఈ మాక్ పార్లమెంటు కార్యక్రమాన్ని బీజేపీ మహిళామోర్చా సమన్వయం చేసింది. బీజేపీ మహిళామోర్చా అధ్యక్షులు శిల్పా రెడ్డి, ఇతర నాయకులు చురుకుగా విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ తరానికి ఎమర్జెన్సీ చీకటి పాలన మీద అవగాహన కల్పించేందుకు వీలుగా మహిళా మోర్చా నాయకులు చక్కటి కసరత్తు చేసి, విద్యార్థులకు సబ్జెక్టు మెటీరియల్ అందించారు. ఎమర్జెన్సీ వంటి దుష్పరిమాణాల మీద ఈ తరం విద్యార్థులకు అవగాహన ఉండాలని అతిథులు అభిప్రాయ పడ్డారు.
…..
మాక్ పార్లమెంటు కార్యక్రమాన్ని కేశవ్ విద్యాసంస్థల సహ కార్యదర్శి శ్రీధర్ జీ, లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి తదితరులు సమన్వయం చేశారు.