దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 6.00 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. అయితే ఆస్పత్రుల్లో బెడ్ల కొరతపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని.. ప్రస్తుతం 5 వేల బెడ్లు వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎమర్జెన్సీ సర్వీసుల సేవలను అందించే వారికి స్పెషల్ పాస్‌లను అందజేస్తామని.. మాల్స్,జిమ్స్,ఆడిటోరియంలను పూర్తిగా మూసేస్తున్నట్లు తెలిపారు. ఇక సినిమా థియేటర్లు 30 శాతం కెపాసిటీతో రన్ చేయాలని తెలిపారు. రెస్టారెంట్లలో డైనింగ్‌పై నిషేధం విధిస్తున్నామని.. పార్శిల్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
https://twitter.com/ANI/status/1382598361136594947