ముడి చమురుకు పెరుగుతున్న డిమాండ్, అలాగే పెరుగుతున్న ధరల కారణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం వెతకాల్సిన అవసరం ఏర్పడింది. ఈ శోధన ప్రపంచవ్యాప్తంగా EVల అభివృద్ధికి దారితీసింది. ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ల ఏర్పాటు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని వినియోగించడంతో ఇప్పుడు 2 వీలర్ల తయారీకి కంపెనీలు ముందుకొచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం EV తయారీదారులు, కొనుగోలుదారులకు సబ్సిడీలు అందించడమే కాకుండా.. వాటిని ఛార్జింగ్ పెట్టడంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆలోచించింది. రాబోయే కాలంలో పెరుగనున్న ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కాకుండా, పెరిగిన వాహనాల సంఖ్య కారణంగా అనేక వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లకు స్థలం కల్పించడం నగరాల్లో కష్టం కావచ్చు అని ఊహిస్తోంది.
ఆగస్టు 2021లో బ్యాటరీలతో, అలాగే బ్యాటరీలు లేకుండా ద్విచక్ర వాహన EVలను తయారు చేయడానికి తయారీదారులకు ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 బడ్జెట్లో, EVల ధరను తగ్గించడానికి, బ్యాటరీలను త్వరగా మార్చడానికి, తద్వారా వాటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి నూతన బ్యాటరీ స్వాప్పింగ్ పాలిసీని ప్రవేశపెట్టబడింది. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు బ్యాటరీ మార్పిడి స్టేషన్లకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
సన్మొబిలిటీ, ఛార్జ్అప్, లిథియన్ పవర్, రిలయన్స్-బ్రిటీష్ బిపి జాయింట్ వెంచర్ సహా తైవాన్‌కు చెందిన గోర్గోతో హీరో మోటోకార్ప్ కంపెనీలు ఈ స్టేషన్లను స్థాపించడానికి ముందుకు వచ్చాయి.
నీతి ఆయోగ్, రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ నివేదికల ప్రకారం, 2030 నాటికి దేశంలోని 80% ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలు, అలాగే 50% నాలుగు చక్రాల వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా అవుతాయని అంచనా వేసింది. అందువల్ల, భద్రత, రక్షణ చర్యలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది ప్రభుత్వానికి.
బ్యాటరీల రకాలు :-
అధిక నిర్దిష్ట ఛార్జ్ సాంద్రత (దీర్ఘకాలం ఛార్జింగ్ ఉండటం, ఎక్కువ శక్తిని నిల్వ ఉంచుకోవడం), భారీ వోల్టేజ్ (3- 3.5 వోల్ట్లు/బ్యాటరీ) కారణంగా లెడ్ బ్యాటరీలకు బదులుగా లిథియం బ్యాటరీలను EVల కోసం ఉపయోగిస్తారు.
లిథియం-అయాన్ బ్యాటరీలలో రెండు రకాలు ఉన్నాయి.మొదటిది సాంప్రదాయ Li-NMC బ్యాటరీలు, ఇందులో కాథోడ్ NMC (నికిల్, మాంగనీస్ సహా కోబాల్ట్) మిశ్రమంగా ఉంటుంది. రెండోది LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్), ఇక్కడ కాథోడ్ LiFePo4 (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) మిశ్రమంగా ఉంటుంది.
ఈ సంవత్సరంలో దాదాపు పది EV వెహికల్ ప్రమాదాలు సంభవించాయి. ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలను అందించడంతో, అనేక స్టార్టప్ కంపెనీలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న చాలా బ్యాటరీలతో ముందుకు వచ్చాయి. EVల మార్కెట్ మూడు రెట్లు పెరిగింది, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,34,821 యూనిట్లు విక్రయించగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4,29,417 యూనిట్లు విక్రయించబడ్డాయి.
ప్రమాదాలు పెరగడానికి కారణాలు :-
1. సెల్ డిజైన్ నాణ్యత తక్కువగా ఉంది: ప్రతి లిథియం-అయాన్ బ్యాటరీ దాదాపు 100-200 సెల్‌లను కలిగి ఉంటుంది. అవి సరిగ్గా ప్యాక్ చేయబడకపోతే.. యానోడ్, కాథోడ్, సెపరేటర్లు సంపర్కంలోకి వచ్చి షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు.
2. బ్యాటరీ డిజైన్: ఇక్కడ ఇన్సులేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు, వైర్లు సరిగ్గా కనెక్ట్ కాకపోవచ్చు, ఇది షార్ట్ సర్క్యూట్‌కు దారి తీస్తుంది.
3. చౌక నాణ్యత గల BMS (బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్): బ్యాటరీ వేడెక్కినప్పుడల్లా, ప్రతిఘటనలను పసిగట్టి సిస్టమ్‌ను చల్లబరచడానికి చర్యలు ప్రారంభించడానికి దానిలో ఒక వ్యవస్థ ఉండాలి. సమర్థవంతమైన BMS లోపిస్తే, అది షార్ట్ సర్క్యూట్లు, అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది.
4. స్మార్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ & థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ : స్మార్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో, బ్యాటరీ ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా ప్రతి సెల్ ఉష్ణోగ్రత నిఘాలో ఉంచబడుతుంది. ఉష్ణోగ్రతలలో ఏదైనా పెరుగుదలను థర్మల్ లేదా యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ద్వారా ఎదుర్కోవచ్చు. సిస్టమ్‌ను చల్లబరచడానికి బ్యాటరీ చుట్టూ యాక్టివేట్ చేయబడతాయి.
EVల కొనుగోలు, నిర్వహణ సమయంలో తీసుకోవలసిన చర్యలు :-
1. EVలను తీవ్రమైన వేడి లేదా శీతల ఉష్ణోగ్రతలలో ఉంచరాదు.
2. అసలైన, కంపెనీ ఇచ్చిన చార్జర్ లను ఉపయోగించాలి.
3. బ్యాటరీలను మండే వస్తువులకు దూరంగా ఉంచాలి.
4. బ్యాటరీలను సాధ్యమైనంత వరకు గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ ఉంచాలి.
5. బ్యాటరీలు వేడెక్కుతున్నాయో లేదో తనిఖీ చేయాలి.
6. బ్యాటరీని 100% ఛార్జ్ చేయకూడదు, అలాగే 20% కంటే తక్కువ డిశ్చార్జ్ కూడా చేయకూడదు. 20-80% మధ్య ఛార్జ్ నిర్వహించడానికి ప్రయత్నించాలి.
7. EVలను కొనుగోలు చేసేటప్పుడు, ఆథరైజెడ్ డీలర్ల నుంచి మాత్రమే బ్యాటరీని కొనుగోలు చేయాలి.
8. EVలు, బ్యాటరీలు ARAI (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా ధృవీకరించబడ్డాయో లేదో తనిఖీ చేయాలి.
9. బ్యాటరీ AIS 156 ప్రమాణంలో ఉందో లేదో తనిఖీ చేయాలి.