కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 10న ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నారు. మే 13న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 13న విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 20వ తేదీ వరకు గడువు .నేటినుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందది. ఇక ఈసారి మొదటిసారిగా వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉంటగా…. ‘ఓటు ఫ్రమ్ హోం’ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. కర్నాటక అసెంబ్లీ గడుపు మే 25తో ముగియనుంది.
కర్నాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ బలం 119 కాగా.. కాంగ్రెస్ కు 75 ఎమ్మెల్యేలు, జేడీఎస్ 28 ఎమ్మెల్యేలు ఉన్నారు.
https://twitter.com/ANI/status/1640965908490522624?s=20