మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రేపే. ఈసారి అధ్యక్ష స్థానం కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటలవరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుంది. రేపు సాయంత్రానికే ఫలితాలు వస్తాయి. ఆదివారం నాటి ఎన్నిక కోసం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.