ప్రస్తుతం దేశంలో మెదడులేని సర్కారు ఉంది. ఈ దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో గొప్పగా ఏం చేయలేదు, మోదీ ఏదో చేస్తారని ప్రజలు నమ్మి ఓటేసి మోసపోయారు’ అంటూ విమర్శలు గుప్పించారు కేంద్రతాజా బడ్జెట్ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్. అయితే ఎనిమిదేళ్లలో మోదీ ఎంతో చేశారంటున్నారు ఆ పార్టీ నాయకులు. దానికి సంబంధించిన ఓ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎనిమిదేళ్లనాటి పరిస్థితిని నేటితో పోలుస్తూ అందులో వివరాలున్నాయి.
2017 జూలై నుంచి మోదీ సర్కారు అమల్లోకి తెచ్చిన జీఎస్టీ దేశ ఆర్థికస్తితిగతుల్నే మార్చేసింది.
నాడు 17 వేర్వేరు పన్నులుంటే ఒకే పన్నులో విలీనం సమగ్రమైన పరోక్ష పన్ను తీసుకువచ్చారు.
ఎనిమిదేళ్ల క్రితం 2 లక్షలు, 5 లక్షల మధ్య పన్ను విధించదగిన ఆదాయంపై … 10 శాతం టాక్స్ ఉంటే… ఇప్పుడు 5 శాతం ఉంది.
రెస్టారెంట్ల బిల్లులపై పన్ను 13 శాతంనుంచి 28 శాతం ఉంటే ఇప్పుడు కేవలం 5శాతం.
ఎనిమిదేళ్లనాడు గృహరుణాలపై వడ్డీ 10.3 శాతం ఉంటే ఇప్పుడు 6.65 శాతంమాత్రమే.
ఎనిమిదేళ్ల క్రితం 1 GB 3G డేటా ప్యాక్ రూ. 250, ఇప్పుడు 1 GB 4G రూ. 5 కంటే తక్కువ ఉంది.
మోదీ ఈ దేశానికి ప్రధాని కాకమునుపు మెడిసిన్, స్టంట్ ల ధరలు మధ్యతరగతికి అందుబాటులో కూడా లేని పరిస్థితి. ఇప్పుడు వాటన్నింటి ధర చాలా తక్కువగా దిగువ మధ్య తరగతికీ అందుబాటులో ఉన్నాయి.
2014 కు ముందు ద్రవ్యోల్బణం రెండంకల్లో ఉంటే ఇప్పుడు 5 శాతం లోపేనంటున్నారు.
నాడు పప్పులు కూరగాయల ధరలు ఆకాశంలో చుక్కల్ని తాకితే నేడు నేలకు దిగివచ్చాయి.
బీజేపీ అధికారంలోకి రాకముందు దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంటే ఇప్పుడు BAA3లో ఉంది.
యూపీఏ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసన్ లో 160 ర్యాంక్ లో ఉంటే..ఇప్పుడు 77 స్థానానికి చేరింది.
మునుపటిలా కాక… రియల్ ఎస్టేట్ బిల్డర్లు RERA కింద గడువు కంటే ముందే ప్రాజెక్ట్ డెలివరీ చేయవలసి ఉంది.
ఒకప్పుడు ఇష్టారాజ్యం అన్నట్టుండేది. ఇప్పుడు 2014 కంటే 70శాతం ఎక్కువ హైవేల నిర్మాణం జరిగింది.
ఇక ఎనిమిదేళ్ల క్రితం ఔషధాల ధరలు ఫార్మా కంపెనీల నియంత్రణలో ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి. వాటిలో 50శాతం వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఉడాన్, స్వచ్‌భారత్, జన్‌ధన్, GST, బేటీ పడావో – బేటీ బచావో వంటి పథకాలెన్నో తీసుకువచ్చారని గుర్తు చేస్తున్నారు.
అంతేకాదు ఎనిమిదేళ్ల క్రితం భారత ప్రధాని ఎవరంటే చాలామంది దేశపౌరులకే తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రధాని ఎవరిచేతిలోనో కీలుబొమ్మ కాదని…ప్రపంచానికంతా తెలుసనీ అంటున్నారు.