హుజూరాబాద్ లో అప్పుడే ఉప ఎన్నికల ప్రచారం మొదలైంది. ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డి కమలాపూర్ మండలం అంబాలలో ప్రచారం మొదలు పెట్టారు. ఈటల అభిమానులు, బీజేపీ శ్రేణులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
బత్తినివారి పల్లి,గోపాల్పూర్, గుంటూరు పల్లి,లక్ష్మీపూర్ లలో ఇంటింటికీ తిరిగి ప్రజలను కలవనున్నారు జమున. భూకబ్జా ఆరోపణలపై సీఎం కేసీఆర్ ఆయన్ని మంత్రివర్గంనుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసింది. దీంతో ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెండురోజుల క్రితమే బీజేపీలో చేరారు. ఈటల లేదా జమున ఉపపోరు బరిలో ఉండవచ్చని తెలుస్తోంది. అయితే బీజేపీ సహా ఏ పార్టీ ఇంకా అభ్యర్థుల ఎంపికనుఖరారు చేయలేదు. అయినప్పటికీ హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం అప్పుడే వేడెక్కింది. ప్రధాన పార్టీలు ఇన్ చార్జిలను కూడా ప్రకటించారు. దీంతో రాష్ట్ర నాయకుల రాకతో హుజూరాబాద్ నియోజకవర్గ గ్రామాల్లో సందడి నెలకొంది.