వీణవంక మండలం ఘన్ముకులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈటల సతీమణి జమున. గ్రామస్తులు ఆమెకు మంగళహారతులతో స్వాగతం పలికారు. శివాలయం, హనుమాన్, పోచమ్మ గుడి లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రచారం మొదలు పెట్టారు. తరువాత స్థానిక చర్చిలోనూ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఆత్మగౌరవానికి,అహంకారానికి.. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరులో తన భర్తను గెలిపించాలని గ్రామస్తులను కోరారు. తెలంగాణ అంతా హుజురాబాద్ నియోజకవర్గం వైపు చూస్తోందని…18 ఏళ్లుగా ఎంతో చేసిన ఈటలను గెలిపించాలని కోరారు.