కమలాపూర్ మండలం కన్నూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈటల జమున. ఉద్యమకారులకు అన్యాయం చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆమె అన్నారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలంటున్నారని ఆమె అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు సరికదా …ఎన్నికలకోసం టీఆర్ఎస్ వాళ్లు వచ్చి మళ్ళీ వాగ్దానాలు చేస్తున్నారు అని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్స్ లేవు, యువతకి ఉపాధి లేదు, నిరుద్యోగ భృతి లేదు అని ఆమె విమర్శించారు. ఈ సారి పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని హుజురాబాద్ ప్రజలందరినీ కోరుతున్నట్టు జమున చెప్పారు.