ఆమ్ వే ఇండియాకు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. సంస్థపై మనీల్యాండరింగ్ కేసు మోపిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 758 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఆమ్ వే సంస్థ మనీ లాండరింగ్ కు పాల్పడిందని ఈడీ గుర్తించింది.
సంస్థ ఆస్తులతో పాటు, ఫ్యాక్టరీకి సంబంధించిన స్థలాలను కూడా ఈడీ సీజ్ చేసింది. రూ.411 కోట్ల ఆస్తులు, రూ. 345 కోట్ల బ్యాంక్ బాలెన్స్ ప్రీజ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న 36 బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేశారు.ఆమ్ వే సంస్థ ఇప్పటివరకు రూ. 27,562 కోట్ల వ్యాపారం చేసినట్టుగా ఈడీ గుర్తించింది. కమిషన్ రూపంలో రూ.7,588 సంస్థ చెల్లించినట్టుగా ఈడీ తెలిపింది. అమెరికాకు చెందిన బ్రిట్ వరల్డ్ వైడ్ నెట్ వర్క్ 21లో అమ్ వే షేర్లు పెట్టినట్టుగా ఈడీ గుర్తించింది.
తమిళనాడు దిండిగల్ జిల్లాలోని ఫ్యాక్టరీ స్థలంతో పాటు ఫ్యాక్టరీలో ఉన్న మిసనరీ, వాహనాలను కూడా సీజ్ చేసినట్టుగా ఈడీ వివరించింది. మల్టీలెవల్ మార్కెటింగ్ నెట్ వర్క్ ముసుగులో ఆమ్ వే సంస్థ మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నట్టుగా ఈడీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో ఉన్న ఉత్పత్తులతో పోలిస్తే సంస్థ ఉత్పత్తుల ధరలు చాలా ఎక్కువ ఉన్నట్టు ఈడీ గుర్తించింది. అంతేకాదు నిజాలు దాచి పెట్టి సామాన్యులను సభ్యులుగా చేర్చి గొలుసుకట్టు వ్యాపారం చేస్తూ…. అధిక ధరలు వస్తువుల్ని విక్రయిస్తున్నారని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. సంస్థపై పలు కేసులూ నమోదయ్యాయి. ఆ అన్ని కేసులపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.
ఆమ్ వే 1996-97 లో భారతదేశంలో రూ. 21.39 కోట్లను షేర్ కాపిటల్ గా ఇండియాకు తీసుకు వచ్చింది. 2020-21 ఆర్ధిక సంవత్సరం వరకు ఆమ్ వే కంపెనీ తన పెట్టుబడిని మాతృ సంస్థలకు డివిడెండ్ రాయల్టీ ద్వారా చెల్లించినట్టుగా ఈడీ గుర్తించింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)