హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీమంత్రి ఈటలరాజేందర్ పాదయాత్ర ఇవాళే మొదలైంది..
ఉదయం 9.30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుంచి యాత్ర ప్రారంభించారు.బత్తినివానిపల్లి లో ఆంజనేయస్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు చేశారు .
శనిగరం, మాదన్న పేట, గునిపర్తి , శ్రీరాముల పేట, అంబాల మీదుగా ఇవాళయాత్రసాగుతోంది. రాత్రి అంబాలలో ఆయన బస చేస్తారు. అంతకుముందు ఈటల సతీమణి జమునారెడ్డి నుదుట తిలకందిద్ది, హారతినిచ్చారు.
23 రోజుల పాదయాత్ర ఉంటుంది.
107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయనున్నారు ఈటల.