అపోలో నుంచి ఈటల రాజేందర్ డిశ్చార్జయ్యారు.
తరువాత మీడియాతో మాట్లాడారు.
ఉద్యమ సహచరులు కనుమరుగై
ఉద్యమ ద్రోహులు రాజ్యమేలుతున్నారని ఈటల అన్నారు.
మానుకోటలో ఉద్యమకారుల రక్తాన్ని కళ్ళ చూసిన కౌశిక్ రెడ్డి కి ముఖ్యమంత్రి…ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఉద్యమ కారుల గుండెలకు గాయాలు చేశారన్నారు..
2018 లో కౌశిక్ కోవర్ట్ గా పని చేసినందుకు కేసీఆర్ అయనకు ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చినట్లుందన్నారు.
ఇలాంటి ప్రభుత్వాన్ని భరిద్దామా అని ప్రశ్నించారు.
రాజకీయ పార్టీలు ప్రజలను నమ్ముకుంటే… కెసిఆర్ డబ్బును నమ్ముకున్నారని ఆరోపించారు.
ఇప్పటికే 150 కోట్లు నగదును హుజురాబాద్ లో నాయకులకు పంచారని ఈటల మండిపడ్డారు.