ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగుతోంది. రెండోరోజు యాత్రలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ. పాల్గొన్నారు.
ఉదయం అంబాల నుండి యాత్ర మొదలైంది. తన నా పుణ్యమా అని కెసిఆర్ దళితులకు కొత్త స్కీం ప్రకటించారని సంతోషంగా ఉందని… ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం తనకే వేయండని ఈటల విజ్ఞప్తిచేశారు.మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని.. నిజమైన దళిత సాధికారత సాధించేలా ఏర్పాటు చేయాలనీ అన్నారు.అంతేతప్ప ఓట్ల కోసం దళితులను మరో సారి మోసం చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు.ఒక్క హుజురాబాద్లో కాకుండా మొత్తం రాష్ట్రమంతా అమలు చెయ్యాలన్నారు..
హుజూరాబాద్ కు వస్తున్న ఎమ్మెల్యేలు , మంత్రులు తమ తమ నియోజకవర్గాల ప్రజలకోసం పనిచేయాలితప్ప తన ఇలాఖాకి వచ్చి డ్రామాలాడొద్దని హెచ్చరించారు.
ముదిరాజ్ కాలనీలోని గుడిలో ప్రత్యేక పూజలు చేశారు..
వృద్ధులతో మాట్లాడి.. అక్కడే ఉన్న రామాలయంలో పూజలు చేశారు.
అంబాల శివార్లలో ఉన్న పొలాలలో పని చేస్తున్న రైతులు రైతు కూలీలతో ఈటల మాట్లాడారు.. కూలీల కష్టాలని అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. ఈటల కే ఓటు వేసి గెలుపిస్తమని వారంతా హామీ ఇచ్చారు.
ఉదయం అంబాలనుంచిడప్పు సప్పుల్లతో, కోలాటాల నృత్యాలతో మొదలైన యాత్ర చివరివరకూ అంతేసందడిగా సాగుతోంది…
భారీగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈటలవెంట నడుస్తున్నారు.