వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేసిన దీదీకి ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మతం పేరుతో ఓట్లను అడిగారన్న ఆరోపణలు రావడంతో ఈసీ బుధవారం నాడు నోటీసు జారీచేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని.. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మమతా బెనర్జీ.. ముస్లింలు తమ ఓట్లు చీలిపోకుండా చూసుకోవాలని.. ఇతర పార్టీలకు వేయొద్దంఊ వ్యాఖ్యానించారు. ముస్లిం ఓటర్లంతా టీఎంసీ పార్టీకే ఓటెయ్యాలంటూ కోరారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం చెందిన బీజేపీ నేతలు.. మమతా బెనర్జీ మతపరమైన రాజకీయాలు చేస్తోందంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు స్పందించి నోటీసు జారీ చేశారు.