బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు తన మద్దతు ప్రకటించిన డచ్ శాసనసభ్యుడు గీర్ట్ విల్డర్స్ ను ఇస్లామిస్టులు ట్రోల్ చేస్తున్నారు.
“ఇతర ప్రవక్తలు, వారి వివాహ వయసు మీద అంత శ్రద్ధ పెడుతున్నారు మీకేం అవసరం’.అని కొందరంటే…
సయ్యద్ అనే ఒక ఇస్లామిస్ట్ ఇలా వ్రాశాడు, “హే గీర్ట్ విల్డర్స్, హిందూ మతంలో బాల్య వివాహాల గురించి నూపుర్ శర్మను అడగండి. స్నానం చేసే స్త్రీల దుస్తులను దొంగిలించే వ్యక్తి గురించి అడగండి” అని ట్వీట్ చేసాడు.
వీటిపై గీర్ట్ విల్డర్స్ స్పందిస్తూ, “సాంస్కృతిక సాపేక్షవాదం తప్పుదారి పట్టించే భావన. మనుషులు సమానమే కానీ సంస్కృతులు కాదు. అసహనంపై ఆధారపడిన సంస్కృతి కంటే మానవత్వం, స్వేచ్ఛపై ఆధారపడిన సంస్కృతి ఎల్లప్పుడూ ఉత్తమమైనది. అందుకే నేను ఇస్లాం కంటే హిందూ మతాన్ని మిలియన్ రెట్లు ఎక్కువగా గౌరవిస్తాను” అని ట్వీట్ చేశారు.
https://twitter.com/geertwilderspvv/status/1536462042433048576?s=20&t=yba7NcCkkPfR1ABicKcxNQ
అంతకుముందు జూన్ 12న మాజీ బీజేపీ అధికార ప్రతినిధికి అన్నివిధాలా అండగా ఉంటానన్నారు.
“మతపరమైన భావాలను దెబ్బతీయడం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం ఆరోపణలపై శర్మపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది దారుణం. ఆమె ఏ తప్పూ చేయలేదు. నేను ఆమెకు సాయం చేస్తాను, ”అని వైల్డర్స్ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
https://twitter.com/geertwilderspvv/status/1536014673799176195?s=20&t=pbuV8_61t6Zlf1p5pgY2LQ
నేను భారతీయుడిని కాదు, హిందువును కాదు.. కానీ సెక్యులరిజంలో హిందూ దేవుళ్లను కించపరచవచ్చని..మహమ్మద్ గురించి నిజం చెప్పడం సమంజసం కాదనే అభిప్రాయం ఉంది. హిందూ దేవుళ్లను కించపర్చినందునే నూపుర్ శర్మ స్పందించిందని ఆయన అన్నారు.
https://twitter.com/geertwilderspvv/status/1535730126503170049?s=20&t=AEJSblm9LYZlgU3xVKvEqA