మహ్మద్ ప్రవక్తపై దుర్బాషలాడిందన్న ఆరోపణలపై బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మకు ఒక డచ్ శాసనసభ్యుడు మద్దతుగా నిలిచారు. గీర్ట్ వైల్డర్స్ ‘పార్టీ ఫర్ ఫ్రీడమ్’ నాయకుడు, నెదర్లాండ్స్‌లోని ప్రతినిధుల సభలో సభ్యుడు. నూపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తున్న అరబ్ తోపాటు ఇస్లామిక్ దేశాలను వైల్డర్స్ దూషించారు. ఆమె ముహమ్మద్ గురించి నిజం ఆమె మాత్రమే మాట్లాడింది అని అన్నారు.
“ఆయిషాకు ఆరేళ్ల వయసులో వివాహం చేసుకున్న ముహమ్మద్ ప్రవక్త గురించి నిజాలు మాట్లాడినందుకు అరబ్, ఇస్లామిక్ దేశాలు భారత రాజకీయ నేత నూపుర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉంది. భారత్ ఎందుకు క్షమాపణ చెప్పాలి?” అని ఆయన ట్విట్టర్లో రాశారు.
https://twitter.com/geertwilderspvv/status/1533820267339866113?s=20&t=MKt90eN-Z6eAXc16ipBqfg
ఆయన ఇస్లామిక్ దేశాల బెదిరింపులకు బయపడవద్దని సలహా ఇచ్చారు. ఒక వర్గాన్ని శాంతింపజేయడం ఎప్పటికీ పని చేయదని చెప్పాడు. అది పరిస్థితులను మరింత దిగజార్చుతుంది. ముహమ్మద్ గురించి నిజాలు మాట్లాడిన నూపుర్ శర్మను సమర్థించాలని భారతీయులకు సలహా ఇచ్చారు.
“బుజ్జగింపు ఎప్పుడూ పనిచేయదు. ఇది విషయాలను మరింత దిగజార్చుతుంది. కాబట్టి భారతదేశానికి చెందిన నా ప్రియమైన మిత్రులారా, ఇస్లామిక్ దేశాలకు భయపడకండి. స్వేచ్ఛ కోసం నిలబడండి.. ముహమ్మద్ గురించి నిజం మాట్లాడిన మీ రాజకీయ నేత నూపూర్ శర్మని సమర్థించడంలో గర్వంగా, దృఢంగా ఉండండి”అని ఆయన మరొక ట్వీట్లో పేర్కొన్నాడు.
https://twitter.com/geertwilderspvv/status/1533852847787352064?s=20&t=9KhFfiDyfQelTurCGobBuA