దుబ్బాక ఉపఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల
దుబ్బాక ఉపఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబరు 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి…అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరులో నిలుస్తున్నాయి. ఈమేరకు అభ్యర్థులను ఖరారుచేయాల్సిఉంది.
మరోవైపు దుబ్బాకలో ప్రచారం హోరెత్తుతోంది. నోటిఫికేషన్ కూడా రావడంతో మరింత దూకుడుగా వెళ్తున్నాయి పార్టీలు.
దుబ్బాకతో పాటు ఇంకా పలు రాష్ట్రాల్లో …56 అసెంబ్లీ స్థానాలు, ఓ ఎంపీ స్థానానికి షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. బిహార్లోని వాల్మీకి లోక్ సభ స్థానానికి జరగనుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. నవంబర్ రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
షెడ్యూల్ వివరాలు..
నామినేషన్ల దాఖలు: అక్టోబర్ 9 నుంచి..
నామినేషన్లకు చివరి తేదీ : అక్టోబర్ 16
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17
ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19
పోలింగ్ తేదీ : నవంబర్ 3
కౌంటింగ్ తేదీ నవంబర్: 1